BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 04:26 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత నీటి నిర్వహణ విధానాలపై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Nov, 2026 - 04:26 PM
14 వీక్షణలు

జల్ జీవన్ మిషన్ ద్వారా ఏడేళ్లలో 80 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించామని వెల్లడి

న్యూఢిల్లీ (ఎన్ టుడే న్యూస్):

భారతదేశం అమలు చేస్తున్న నీటి నిర్వహణ విధానాలు, తాగునీటి సరఫరా కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డైరెక్టర్ సరోజ్ కుమార్ ఝా ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ద్వారా గణనీయమైన పురోగతి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏడేళ్ల కాలంలో సుమారు 80 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాగునీటి సదుపాయాలను విస్తరించడంలో భారత్ అనుసరిస్తున్న విధానాలు, చేపడుతున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని వివరించారు.

నీటి వనరుల సమర్థ నిర్వహణ, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం వంటి అంశాల్లో భారత్ సాధించిన అనుభవాలు ఇతర దేశాలకు కూడా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

2026లో అబుదాబిలో జరగనున్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) వాటర్ కాన్ఫరెన్స్‌లో భారతదేశం తన నీటి నిర్వహణ అనుభవాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా సాధించిన పురోగతిని ప్రపంచ దేశాలతో పంచుకోవాలని సరోజ్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. నీటి భద్రత, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి ప్రపంచవ్యాప్త సవాళ్ల పరిష్కారానికి భారత్ అనుభవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.