BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:19 pm
Posted by : K MAHESH

ఆరుట్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:19 PM
9 వీక్షణలు

ఈ నెల 22 నుంచి పోటీలు ప్రారంభం.. జట్టు నమోదు చేసుకోవడానికి ఈ నెల 9 నుంచి 12 వరకు అవకాశం

ఇబ్రహీంపట్నం, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆరుట్ల ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను గ్రామ సర్పంచ్ మానిపాటి శోభా కుమార్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు ఆవిష్కరించారు. ప్రతి ఏడాది ఆరుట్ల ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహక యువకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే జట్లు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.600 ఎంట్రీ ఫీజు చెల్లించి తమ జట్టు పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా జట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

ఆరుట్ల ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు క్రికెట్ పోటీలు కొనసాగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. గ్రామంలోని యువత క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడంతోపాటు, టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకుల సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ప్రజాగలం దామర భూపాల్, వివిధ పార్టీల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.