BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 08:50 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

FFS యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై వ్యవసాయ సిబ్బందికి అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
18 Nov, 2026 - 08:50 PM
9 వీక్షణలు

కొండపి, నవంబర్ 18 (ఎన్ టుడే న్యూస్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా FFS యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు పారదర్శకంగా నిర్వహించే విధానంపై కొండపి మండల పరిధిలోని VAAలు, AEOలు, డీలర్లు, PACS సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి M. మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు ఒకే విధానంలో, పారదర్శకంగా జరిగేలా చూడటమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు స్వయంగా ప్లే స్టోర్ నుంచి FFS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్ లేదా ఫార్మర్ ఐడీ ద్వారా లాగిన్ కావాలని సూచించారు.

యాప్‌లో తాము సాగు చేయబోయే పంటను, అవసరమైన ఎరువుల రకాన్ని ఎంపిక చేసుకుని, అందుబాటులో ఉన్న డీలర్, PACS లేదా RSK కేంద్రాన్ని ఎంచుకోవాలి. అనంతరం QR కోడ్ జనరేట్ చేసుకోవాలని తెలిపారు. QR కోడ్ జనరేట్ చేసిన 48 గంటల్లోపు నిర్ణీత రుసుము చెల్లించి ఎరువులను పొందవచ్చని వివరించారు.

రైతులకు ఈ విధానంపై ఎలాంటి సందేహాలు ఉన్నా తమ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. అవసరమైన సహాయం తీసుకుని QR కోడ్ జనరేట్ చేసుకోవాలని కోరారు.