BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరు పాఠశాలలో ఆయా విజయమ్మకు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:31 PM
71 వీక్షణలు

 ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల అభినందన

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో ఆయాగా విధులు నిర్వహిస్తున్న ఎం. విజయమ్మ సేవలను గుర్తించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు విజయమ్మకు శాలువా కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో ఆయాగా ఆమె అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నిత్యం పాఠశాల పరిశుభ్రతను కాపాడుతూ విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ సిబ్బంది విజయమ్మకు దుస్తులను బహుకరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల చేతుల మీదుగా జరిగిన ఈ సన్మానం ఆమెకు ఆనందాన్ని కలిగించింది. పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా విద్యార్థుల్లో మానవత్వం, కృతజ్ఞతాభావం పెంపొందుతాయని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. రాం ప్రదీప్, ఉపాధ్యాయులు జయశ్రీ, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.