BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్ ఖాతాదారులకు బ్యాంకుల నోటీసులు.. అదనపు బంగారం పెట్టాలి లేదా నగదు చెల్లించాలి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
17 వీక్షణలు

పసిడి ధరలు తగ్గడంతో బ్యాంకర్లకు కొత్త తలనొప్పి.. అయోమయంలో రుణగ్రహీతలు భారీగా తగ్గుతున్న బంగారం ధరలు గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు నగలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. తనఖా పెట్టిన బంగారం విలువ తగ్గిపోవడంతో రుణ మొత్తానికి, తనఖా ఆస్తి విలువకు మధ్య నిష్పత్తిని కొనసాగించడం బ్యాంకులకు సవాలుగా మారింది. దీంతో అదనపు నగదు చెల్లించాలని లేదా మరింత బంగారాన్ని తనఖా పెట్టాలని బ్యాంకులు ఖాతాదారులను కోరుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బంగారు రుణాలపై రుణం-విలువ నిష్పత్తి (ఎల్‌టీవీ) నిర్దేశిత పరిమితుల్లో ఉండాలి. రూ.2.5 లక్షల వరకు రుణాలకు 85 శాతం, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80 శాతం, రూ.5 లక్షలకు పైబడిన రుణాలకు 75 శాతం వరకు ఎల్‌టీవీ పరిమితి వర్తిస్తుంది. రుణ కాలపరిమితి ముగిసే వరకు ఈ నిష్పత్తిని కొనసాగించాల్సిన బాధ్యత రుణ సంస్థలపై ఉంటుంది. ఇటీవలి కాలంలో పసిడి ధరలు గణనీయంగా పడిపోవడంతో తనఖా బంగారం విలువ తగ్గింది. దీంతో రుణాల భద్రతపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఆందోళన మొదలైంది. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గితే రుణాల వసూళ్లలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్న సంస్థలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. అదనపు బంగారం తనఖా పెట్టాలని లేదా కొంత రుణ మొత్తాన్ని చెల్లించాలని ఖాతాదారులకు సూచిస్తున్నాయి. మరోవైపు రుణాలు చెల్లించడంలో విఫలమయ్యే ఖాతాదారుల విషయంలో నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైన గడువు ఇచ్చినప్పటికీ బకాయిలు చెల్లించకపోతే నిబంధనలకు అనుగుణంగా తనఖా బంగారాన్ని వేలం వేసే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటికే బంగారం ధరల తగ్గుదల తర్వాత వేలం ప్రక్రియలు పెరిగినట్లు ఆర్థిక సంస్థల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఒకవైపు బంగారం ధరలు తగ్గడం, మరోవైపు బ్యాంకుల నుంచి అదనపు బంగారం లేదా నగదు చెల్లించాలంటూ సమాచారం రావడంతో గోల్డ్ లోన్ తీసుకున్న ఖాతాదారులు అయోమయానికి గురవుతున్నారు. రుణం తీసుకునే సమయంలో ఉన్న ధరలకు, ప్రస్తుతం ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసం వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. పసిడి ధరల ఒడిదుడుకులు అటు బ్యాంకర్లకు, ఇటు రుణగ్రహీతలకు కొత్త తలనొప్పిగా మారాయి.