BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రూ.50 లక్షల ఆస్తి కోసం ఘాతుకం.. తండ్రి, సోదరిని హత్య చేసిన 26 ఏళ్ల యువకుడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
9 వీక్షణలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆస్తి వివాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఇంటి విక్రయం ద్వారా వచ్చిన రూ.50 లక్షల నగదు విషయంలో తలెత్తిన గొడవ చివరకు జంట హత్యలకు దారితీసింది. కన్నతండ్రితో పాటు సొంత సోదరిని 26 ఏళ్ల యువకుడు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నవంబర్ 19న హర్షిత యాదవ్ అనే యువతి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. ఆమె నోటికి స్కార్ఫ్ చుట్టి ఉండటంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, హర్ష్ యాదవ్ అనే యువకుడు ఓ మైనర్ బాలుడితో కలిసి సంచరించినట్లు గుర్తించారు. ఇదే సమయంలో అతడి తండ్రి, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు యాదవ్ మృతదేహం సమీపంలోని మరో పట్టణంలో లభ్యమైంది. పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. రాజు యాదవ్ ఇటీవల ఇండోర్‌లోని తన ఇంటిని సుమారు రూ.50 లక్షలకు విక్రయించాడు. వచ్చిన మొత్తంలో రూ.25 లక్షలను కుమార్తె హర్షితకు ఇవ్వడంతో మిగిలిన నగదు విషయంలో తండ్రి, కుమారుడి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో హర్ష్ తన మైనర్ సహచరుడి సహాయంతో ముందుగా తండ్రి రాజును హత్య చేసి మృతదేహాన్ని మరో ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మరుసటి రోజు సోదరి హర్షితను కూడా హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న హర్ష్ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం ఆస్తి పంపకాల వివాదం కారణంగా ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె హత్యకు గురైన ఘటన ఇండోర్‌లో తీవ్ర కలకలం రేపింది.