27న ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి
జాతీయం
బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సమాచారం వెల్లడించింది. ఈ నెల 27న ఆదివారం అయినప్పటికీ దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. ఈ నెల 28 నుంచి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకు సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఆదివారం బ్యాంకులను తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది.
సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 27వ తేదీన అందుబాటులో ఉండే సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించింది. మూడు రోజుల సమ్మె ప్రభావంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ముందుగానే అవసరమైన లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది.