BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 08 November 2026, 06:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెంలో మాస్టారు పట్టుదల.. రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 06:22 AM
48 వీక్షణలు

19 ఓట్ల స్వల్ప మెజారిటీతో కూటమి విజయం.. కాలసాని సూర్యనారాయణ వ్యూహం ఫలితం

బూరుగుగూడెం: ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలంలోని బూరుగుగూడెం ఎంపీటీసీ ఎన్నికల ఫలితం స్థానిక రాజకీయాల్లో పెను చర్చకు దారితీసింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో అడుగులు వేసిన కాలసాని సూర్యనారాయణ అలియాస్ మాస్టారు బూరుగుగూడెం రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. గతంలో సమితుల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలుగా నిలిచిన బూరుగుగూడెం, పర్వతాపురం, పోతనపల్లి, నరసింహారావుపాలెం, గుడిపాడు గ్రామాల్లో ఈసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు గట్టి ఎదురుదెబ్బగా పరిణమించాయి. ఈ ఐదు గ్రామాల పరిధిలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులు మండలవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా బూరుగుగూడెం–పర్వతాపురం ఎంపీటీసీ విభాగంలో కూటమి అభ్యర్థి కేవలం 19 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కొలుసు పార్థసారథి బూరుగుగూడెం గ్రామమంతటికీ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు వేయిస్తామంటూ ఇచ్చిన హామీతో పాటు కాలసాని సూర్యనారాయణ మాస్టారు పట్టుదల, నిరంతర కృషి కూటమి విజయానికి దోహదపడిన ప్రధాన అంశాలుగా స్థానికంగా చర్చ సాగుతోంది. మరోవైపు నరసింహారావుపాలెం–గుడిపాడు ఎంపీటీసీ విభాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి అక్కడ నాయకుడు పుచ్చకాయల సుబ్బారెడ్డి  తన పట్టును నిలబెట్టుకున్నారు. ఇక పోతనపల్లి–మంకొల్లు ఎంపీటీసీ విభాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 152 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆ ప్రాంత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారంగుల శ్రీనివాసరావు అలియాస్ వాసు తన రాజకీయ ఉనికిని మరోసారి చాటుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం బూరుగుగూడెం–పర్వతాపురం ఎంపీటీసీ ఫలితమే. వైయస్సార్ సిపి మండల నాయకుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి సొంత గ్రామం మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు ఉన్న ప్రాంతంలో కూటమి అభ్యర్థి విజయం సాధించడం స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. కేవలం 19 ఓట్ల తేడాతో నమోదైన ఈ గెలుపు వెనుక మాస్టారు చేసిన కృషితో పాటు పర్వతాపురంలో టీడీపీ నాయకులు బూబత్తుల చెన్నారావు, బొర్రా నాగేశ్వరరావు, మిద్దె సత్యనారాయణ అలియాస్ అడవి సత్యం, ఉయ్యాల దిలీప్, మిద్దె రాము తదితరులు చేసిన రాజకీయ ప్రయత్నాలు కూడా ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. వైసీపీ ఓటమిపై రకరకాల చర్చలు: చాట్రాయి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న దేశిరెడ్డి రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆశించిన స్థాయిలో చురుగ్గా పాల్గొనలేదనే విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో తనకు ఎంతటి రాజకీయ బలం ఉన్నప్పటికీ బూరుగుగూడెంలో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను పలుమార్లు అభ్యర్థిస్తూ, తన విజయానికి కృషి చేసిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయన ఇంటింటి ప్రచారానికి దూరంగా ఉండి, ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో కీలక అంశం ఆయన రాజకీయ గురువుగా భావించే గడ్డం సత్యనారాయణరెడ్డి మనుమడు గడ్డం లోకేశ్వర్ రెడ్డికి మండలంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం. ఈ పరిణామం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టానికి ఒక కారణమై ఉండవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల మధ్య సమన్వయం, ప్రచార వ్యూహం వంటి అంశాల్లో లోపాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది. ఇక దేశిరెడ్డి రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో నామమాత్రంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉద్దేశపూర్వకంగానే ప్రచారానికి దూరంగా ఉన్నారా, లేక ఇతర రాజకీయ, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే డబ్బు ప్రభావం, రాజకీయ ఉనికికి సంబంధించిన ఆందోళనలు, ఆస్తులపై విచారణ జరుగుతుందనే భయాలు వంటి అంశాలను కొందరు చర్చకు తీసుకొస్తున్నప్పటికీ, వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ ప్రస్తుతం స్థానికంగా వినిపిస్తున్న అనుమానాలు, చర్చలు మాత్రమే. ఈ అంశాలపై దేశిరెడ్డి రాఘవరెడ్డి స్వయంగా స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది: ఎన్నికల ప్రచారంలో మంత్రి కొలుసు పార్థసారథి గ్రామ ప్రధాన  రహదారితో పాటు వీధి వీధినా సిమెంట్ రోడ్లు, రెండు ప్రక్కలా డ్రైనేజీల వేయిస్తానన్న హామీ ఇప్పుడు బూరుగుగూడెం గ్రామ ప్రజల ముందున్న ప్రధాన అంశంగా మారింది. గ్రామంలోని ప్రధాన రహదారి మొత్తం తో పాటు అన్ని వీధులకు సిమెంట్ రోడ్లు వేయిస్తామన్న హామీ ఎంతవరకు కార్యరూపం దాలుస్తుంది? అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అన్నది గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో సాధించిన 19 ఓట్ల విజయం కూటమికి రాజకీయంగా ఊరటనిచ్చినా, ప్రజల ఆశలు నెరవేర్చడం ఇప్పుడు అసలైన బాధ్యతగా మారింది. మాస్టారు పట్టుదలతో సాధించిన రాజకీయ విజయాన్ని గ్రామాభివృద్ధి రూపంలో చూపించగలిగితేనే ఈ గెలుపునకు నిజమైన సార్థకత చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. బూరుగుగూడెం రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇక అభివృద్ధి విషయంలో ఎవరు ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తారన్నదే రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది.