BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 04:04 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
04 Oct, 2026 - 04:04 PM
11 వీక్షణలు

హైదరాబాద్: సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పరిచయాల విషయంలో యువత, ముఖ్యంగా 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలబాలికలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలి సైబర్ నేరాల కేసుల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులతో సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.

కొంతమంది నేరస్థులు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి యువతతో పరిచయం పెంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నమ్మకం కలిగించి వ్యక్తిగత ఫొటోలు, ఇతర వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లను స్వీకరించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పంపవద్దని సూచిస్తున్నారు.

ఎవరైనా వ్యక్తిగత ఫొటోలు లేదా వీడియోల పేరుతో బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా ఆధారాలను భద్రపరచాలని పోలీసులు సూచిస్తున్నారు. సంబంధిత సోషల్ మీడియా ఖాతాలు, మెసేజ్‌లు, ఫొటోలు, బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను డిలీట్ చేయకుండా భద్రపరచడం ద్వారా దర్యాప్తులో ఉపయోగపడే ఆధారాలను అందించవచ్చని తెలిపారు.

సైబర్ నేరానికి గురైన వారు National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.