భారత్ DNAలోనే ఇన్నోవేషన్: మోదీ
అంతర్జాతీయం
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డీఎన్‌ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని ఆయన అన్నారు.
సుస్థిర భవిష్యత్తు, ప్రపంచ మేలు కోసం భారత్ వేగంగా ఆవిష్కరణలు చేస్తోందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో దేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సంస్కరణల వేగం తగ్గదని, “సంస్కరణల ఎక్స్‌ప్రెస్” నిరంతరం కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాయని ఆయన వివరించారు.