BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 05:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రశ్నించే జర్నలిస్టుకు భారత వీసా రద్దు..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 05:57 PM
2 వీక్షణలు

నార్వే విమానాశ్రయంలో హెల్లె లింగ్‌కు అడ్డంకులు 

ప్రధాని నరేంద్ర మోదీని గతంలో ప్రశ్నించిన నార్వేకు చెందిన జర్నలిస్ట్ హెల్లె లింగ్ (Helle Lyng)కు భారత్‌లో పర్యటించేందుకు వీసా మంజూరైనప్పటికీ, చివరి నిమిషంలో ప్రయాణానికి అడ్డంకులు ఎదురైనట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న 'భారత్ సమ్మిట్‌'లో ప్రసంగించేందుకు తనకు ఆహ్వానం అందిందని, మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అంశాలపై మాట్లాడాల్సి ఉందని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన పాస్‌పోర్టు, వీసా పత్రాలు తన వద్ద ఉన్నప్పటికీ నార్వే విమానాశ్రయంలో తనను అడ్డుకున్నారని పేర్కొన్నారు. భారత హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తన వీసాను రద్దు చేసినట్లు సమాచారం అందిందని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ పరిణామంపై రాజకీయంగా చర్చ మొదలైంది. ప్రశ్నించే గొంతుకలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే నాయకత్వం ప్రశ్నలను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.