BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 14 October 2026, 09:03 am
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై బీజేపీలో ఆశావహుల సందడి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Oct, 2026 - 09:03 AM
59 వీక్షణలు

తెలంగాణ: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

ఒకవేళ రామ్‌చందర్ రావు బరిలో నిలవకపోతే తమకు అవకాశం కల్పించాలని ఎన్‌వీ సుభాష్, డోకూరి పవన్‌తో పాటు మరో పది మంది ఆశావహులు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అభ్యర్థిత్వంపై పార్టీలో ఆసక్తి నెలకొంది.

మరోవైపు నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రాష్ట్ర నాయకత్వం ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు చొప్పున ఆశావహుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, తుది నిర్ణయం కోసం పార్టీ అధిష్ఠానానికి పంపనున్నట్లు సమాచారం. అధిష్ఠానం పరిశీలన అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, సామాజిక సమీకరణాలపై జరుగుతున్న చర్చలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.