BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 11:56 am
Posted by : PAGADALA DEVAIAH

భారత్ సదస్సుపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
14 Nov, 2026 - 11:56 AM
36 వీక్షణలు

చైతన్యపురి చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ నాయకుల అరెస్టు

ఎల్బీనగర్, నవంబర్ 14 (ఎన్‌ టుడే న్యూస్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సదస్సుపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ ఆధ్వర్యంలో చైతన్యపురి చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎల్బీనగర్ ఇన్‌చార్జి సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ సదస్సు పేరుతో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు వేదిక కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ చర్చల కోసం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్న సదస్సుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ సదస్సుకు 70 దేశాల నుంచి సుమారు 1,000 మంది ప్రతినిధులను ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, వీసాల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వీసాల మంజూరు, రద్దు వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతాయని పేర్కొన్నారు.

భారత్ సదస్సు పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే శక్తులకు వేదిక కల్పించే ప్రయత్నాలను ఖండిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ సదస్సులు రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడాలని, రాజకీయ విమర్శలకు వేదికలుగా మారకూడదని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధి కల్పించడం అందరి లక్ష్యంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విస్మరించి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, నిరుద్యోగం, రైతులు, మహిళల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచించారు.

నాయకుల అరెస్టు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, కృష్ణంరాజు, మల్లేష్, శ్రీనివాస్, మురళి, రాజేశ్వరి, బద్దం వివేకానంద రెడ్డి, కేశవ్, లోకేష్, సందీప్, రూప్‌లాల్, భీష్మాచారి, వివేక్ చారి, సతీష్ చారి, దినేష్, రత్నం, హరీష్, వంశీ, రఘునందన్ జోషి, సిద్ధు, బాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు.