BREAKING
thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం
Date of Publish : 23 September 2026, 01:59 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
23 Sep, 2026 - 01:59 PM
2 వీక్షణలు

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు.. లడ్డూ ప్రసాదం ఏటీఎం ప్రారంభం

విజయవాడ, సెప్టెంబర్ 23: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా దేవస్థానం కొత్త సాంకేతిక విధానాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా లడ్డూ ప్రసాదం విక్రయానికి స్వయంచాలక యంత్రాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.


కొండ దిగువన అర్జునవీధి ప్రారంభంలోని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లడ్డూ ప్రసాదం ఏటీఎంను దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


ఈ యంత్రం ద్వారా భక్తులు యూపీఐతో డిజిటల్ చెల్లింపులు చేసి లడ్డూ ప్రసాదాన్ని స్వయంగా పొందేలా ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ల వద్ద ఎక్కువసేపు క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన లడ్డూ పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్న ఈ సేవ పనితీరును పరిశీలించిన అనంతరం రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ మరిన్ని యంత్రాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.


నకిలీ పూజా టికెట్లపై అప్రమత్తంగా ఉండాలి


దసరా ఉత్సవాల నేపథ్యంలో నకిలీ పూజా టికెట్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఇటీవల ఒక భక్తురాలికి నకిలీ పూజా టికెట్ విక్రయించిన ఘటనపై దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.


దేవాలయ దర్శనాలు, ఆర్జిత సేవలు, పూజా టికెట్ల విషయంలో అపరిచిత వ్యక్తులు, మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని అధికారులు సూచించారు. టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, అధికారిక డిజిటల్ సేవలు, అధీకృత కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని కోరారు.


దేవస్థానం పేరుతో ఎవరైనా అనధికారికంగా టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆలయ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


దసరా శరన్నవరాత్రులకు ముమ్మరంగా ఏర్పాట్లు


ఇంద్రకీలాద్రిపై రాబోయే దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.


భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రత, విద్యుత్, వసతులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎండ, వర్షాల నుంచి భక్తులకు ఇబ్బందులు కలగకుండా షెడ్ల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ దర్శన ప్రక్రియను సులభతరం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో భక్తులు అధికారులకు సహకరించి ప్రశాంత వాతావరణంలో దర్శనం పూర్తి చేసుకునేలా సహకరించాలని కోరారు.


— Ntoday News