BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 05:00 pm
Posted by : ఆనంద్ రెడ్డి

కీసర పోలీస్‌స్టేషన్‌లో లంచం వ్యవహారం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
09 Nov, 2026 - 05:00 PM
32 వీక్షణలు

చార్జ్‌షీట్ త్వరగా దాఖలు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్.. రూ.2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

కీసర పోలీస్‌స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చార్జ్‌షీట్‌లో అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, దానిని త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఎస్సై కొండారెడ్డి శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బాధితుడి నుంచి రూ.5 లక్షలు లంచంగా డిమాండ్ చేసిన ఎస్సై, చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా నాగారం పరిధిలోని శిల్పానగర్ కాలనీలో సోమవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగాసాని శ్రీధర్ వెల్లడించారు. చార్జ్‌షీట్ విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు, త్వరగా దాఖలు చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆయన వివరించారు.

పోలీసు శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.