BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 08:26 pm
Posted by : K MAHESH

నిరుద్యోగ యువతకు బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:26 PM
13 వీక్షణలు

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు చేయూత

ఇబ్రహీంపట్నం (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7:

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల పరిధిలో ఉన్న ఆరుట్ల, మంచాల, బండలేమూరు, చెన్నారెడ్డిగూడ, పటేల్ చెరువు తండా గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించడం ద్వారా వారి ప్రిపరేషన్‌కు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ.. నేటి యువతే రేపటి దేశ పౌరులని అన్నారు. యువకులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చి, వారికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.

బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని బూడిద రాంరెడ్డి వెల్లడించారు. యువతకు విద్యా పరంగా ప్రోత్సాహం అందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిషన్ సీఐ ఏడుకొండలు, బుస్సు పుల్లారెడ్డి, చిందం రఘుపతి, ఫౌండేషన్ సభ్యులు పున్నం రాము, మంగ ఐలేష్, అశ్వల బాలరాజ్, కాట్రోత్ రాజు, ఎండీ సద్దాం హుస్సేన్, బి. వెంకటేష్, ఎండీ షాకీర్, గణేష్, బాహుబలి శివ, గ్యార శేఖర్, లింగం యాదవ్, మోహన్, జే. వెంకీ, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.