BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడి నామినేషన్ కేంద్రంలో అభ్యర్థులకు తప్పని తిప్పలు ఒక్కో అధికారి ఒక్కో నిబంధన..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 01:16 PM
5 వీక్షణలు

గంటల తరబడి నిరీక్షణతో పోటీదారుల ఇబ్బందులు చింతలపూడి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియకు వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు వచ్చిన పోటీదారులను గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారని, అవసరమైన పత్రాల విషయంలో అధికారులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచనలు ఇస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారి ఒక పత్రం తప్పనిసరిగా సమర్పించాలని చెబుతుండగా, మరో అధికారి అదే పత్రం అవసరం లేదని, వేరే పత్రాలు తీసుకురావాలని సూచిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏ పత్రాలు సమర్పించాలనే విషయంలో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని పోటీదారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల దశలో అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయినప్పటికీ పత్రాల విషయంలో స్పష్టత లేకపోవడం, గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం అభ్యర్థుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నామినేషన్లకు అవసరమైన పత్రాల వివరాలను ఒకే విధంగా తెలియజేయడంతో పాటు, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పోటీదారులు కోరుతున్నారు.