BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 12:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మాటూరులో వ్యవసాయ మోటర్ల వైర్లు, పైపుల చోరీలు పొలాల్లో వరుస చోరీలతో రైతుల ఆందోళన..

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 12:55 PM
5 వీక్షణలు

రాత్రివేళ నిద్రలేని పరిస్థితి పోలీసులు స్పందించి నైట్ బీట్ నిర్వహించాలని రైతుల విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా, మధిర: మధిర మండలం మాటూరు గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో గుర్తుతెలియని దొంగలు చోరీలకు పాల్పడుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్లకు సంబంధించిన వైర్లను దొంగలు కత్తిరించి అపహరిస్తుండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మోటర్లకు సంబంధించిన వైర్లతో పాటు వ్యవసాయ అవసరాలకు వినియోగించే పైపులను సైతం ఎత్తుకెళ్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక పంటల సాగు విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ చోరీలు అదనపు భారంగా మారాయి. కష్టపడి సాగు చేస్తున్న పంటలకు నీరందించేందుకు ఏర్పాటు చేసుకున్న మోటర్ల వైర్లు, పైపులు చోరీకి గురవుతుండటంతో తిరిగి వాటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్ద భద్రత లేకపోవడంతో ఎప్పుడు ఏ వస్తువు చోరీకి గురవుతుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు వెళ్లాలన్నా ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మాటూరు గ్రామ పరిధిలో పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని, వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చోరీలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు తక్షణమే స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.