BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 12:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు జన్మభూమి రోడ్డులో అస్తవ్యస్తంగా సిమెంట్ ప్లేట్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 12:51 PM
5 వీక్షణలు

నాలుగు రహదారుల కూడలిలో ప్రమాదకర పరిస్థితులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు 

తిరువూరు జన్మభూమి రోడ్డులో అస్తవ్యస్తంగా సిమెంట్ ప్లేట్ల ఏర్పాటు నాలుగు రహదారుల కూడలిలో ప్రమాదకర పరిస్థితులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజల విజ్ఞప్తి తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న జన్మభూమి రోడ్డులో నాలుగు రహదారులు కలిసే కూడలి వద్ద సిమెంట్ ప్లేట్ల ఏర్పాటు అస్తవ్యస్తంగా మారింది. ప్లేట్లను సరైన పద్ధతిలో, సమతలంగా అమర్చకపోవడంతో ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడలి వద్ద వాహనాలను మలుపు తిప్పే సమయంలో కార్లు, ఇతర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు అంచుల్లోని మట్టి కుంగిపోవడంతో సిమెంట్ ప్లేట్లకు సరైన ఆధారం లేకుండా పోయింది. దీంతో అంచుల మీదుగా భారీ వాహనాలు ప్రయాణిస్తే ప్లేట్లు విరిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే నాలుగు రహదారుల కూడలిలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సమస్యను గుర్తించి ప్రమాదం చోటుచేసుకోక ముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరువూరు మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి సిమెంట్ ప్లేట్లను పటిష్టంగా, సమతలంగా అమర్చడంతో పాటు రోడ్డు అంచులకు మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.