BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 16 November 2026, 12:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను గ్రంథాలయంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 12:59 PM
6 వీక్షణలు

పత్రికలు సమాజాన్ని మేల్కొలిపే చైతన్య దీపాలు.. వూటుకూరు నారాయణరావు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో సోమవారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, దేశంలో పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు బాధ్యతాయుతమైన పాత్రికేయ విలువలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 1966 నవంబర్ 16న భారత పత్రికా మండలి (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఏర్పాటైందని తెలిపారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పత్రికలు కేవలం సమాచారాన్ని అందించే సాధనాలు మాత్రమే కాదని, సమాజాన్ని చైతన్యవంతం చేసే శక్తివంతమైన వేదికలని పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అన్యాయాన్ని ప్రశ్నించడం పాత్రికేయుల ప్రధాన బాధ్యతలని అన్నారు. అనంతరం గ్రంథాలయ నిర్వాహకుడు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర పోరాటంలో పత్రికలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడంతో పాటు స్వాతంత్య్ర కాంక్షను రగిలించడంలో పత్రికల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ 59వ వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.