BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 07:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కారు–ట్రాక్టర్ ఢీ.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె మృతి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
09 Nov, 2026 - 07:49 PM
7 వీక్షణలు

భార్యకు తీవ్ర గాయాలు.. కుమారుడికి స్వల్ప గాయాలు

హుస్నాబాద్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

హుస్నాబాద్ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, ఏడేళ్ల కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పైడపల్లి శ్రీకాంత్ (33) తన భార్య స్వాతి, కుమార్తె మహాన్వి (7), కుమారుడు విహాన్ క్రిష్‌తో కలిసి కారులో స్వగ్రామమైన కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో హుస్నాబాద్ మండలం పందిళ్ల బ్రిడ్జి దాటిన తర్వాత పవనసుత మిల్లు సమీపంలో కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్, ఆయన కుమార్తె మహాన్వి మృతి చెందారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య స్వాతిని, కుమారుడు విహాన్ క్రిష్‌ను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుమారుడికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కాలు విరిగినట్లు తెలిసింది.

ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె మృతి చెందడంతో కొండాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.