BREAKING
thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● శ్రీకాళహస్తి:మహేష్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ప్రారంభం thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
Test 4
Date of Publish : 12 November 2026, 07:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ప్రాంతంలో భూగర్భం నుంచి వెలుగులోకి వచ్చిన శివలింగం.. శ్రీ మహా జలలింగేశ్వరుడిగా నామకరణం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 07:19 AM
38 వీక్షణలు

ఆంజనేయస్వామి ఆవహించాడని బాలుడి మాటలు.. ఆరు అడుగుల లోతులో దర్శనమిచ్చిన శివలింగం.. మేళతాళాలతో గ్రామానికి తరలించిన గ్రామస్తులు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఆధ్యాత్మిక ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5వ తేదీ రాత్రి ఓ బాలుడు అసాధారణంగా ప్రవర్తిస్తూ, తన శరీరంపై మంటలు వస్తున్నాయని చెబుతూ రాత్రంతా బాధపడినట్లు గ్రామస్తులు తెలిపారు. నవంబర్ 6వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకున్న బాలుడు బిగ్గరగా ఏడుస్తూ, “తీయాలి.. తీయాలి” అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో తనకు ఆంజనేయస్వామి ఆవహించారని చెబుతూ, తాను రామభక్త హనుమంతుడినని, ఈ గ్రామంలో మహాదేవుడు భూగర్భంలో ఉన్నాడని, గ్రామస్తులు తన వెంట వస్తే ఆ శివలింగం ఉన్న ప్రదేశాన్ని చూపిస్తానని బాలుడు చెప్పినట్లు సమాచారం. అయితే చిన్నపిల్లవాడు చెప్పే మాటల్లో నిజమెంత ఉంటుందనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయగా, మరికొందరు బాలుడి మాటలను విశ్వసించి అతడిని అనుసరించేందుకు ముందుకొచ్చారు. చివరకు శివలింగం ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా చూపిస్తానని బాలుడు చెప్పడంతో గ్రామస్తులు అతడిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అందుబాటులో ఉన్న బ్రాహ్మణుడిని పిలిపించి, గ్రామస్తులంతా కలిసి టి.గుడిపాడు–పోలవరం గ్రామాల మధ్య వాగు సమీపంలోని ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ భూగర్భంలో శివలింగం ఉందని బాలుడు చూపించిన ప్రదేశంలో పండితుల ఆధ్వర్యంలో రెండు హోమాలు నిర్వహించి, పరిసరాల్లో రక్షా కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రామస్తులు వివరించారు. అనంతరం తవ్వకాలు ప్రారంభించగా సుమారు ఆరు అడుగుల లోతులో చెట్ల వేర్లు, ఇతర అవశేషాల మధ్య కప్పబడి ఉన్న శివలింగం బయటపడినట్లు తెలిపారు. శివలింగం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడ్లబండిపై శివలింగాన్ని ఉంచి మేళతాళాలు, హర్షధ్వానాల మధ్య గ్రామంలోని అమ్మ వారి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుని శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆంజనేయస్వామి ఆవహించారని చెబుతున్న బాలుడు గ్రామ పెద్దను పిలిచి, ఆయనకు స్వప్నంలో మహాదేవుడు కనిపించాడా అని ప్రశ్నించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీనికి గ్రామ పెద్ద స్పందిస్తూ, తన కలలో శివుడు కనిపించి ఆలయం నిర్మాణం జరుగుతున్నట్లుగా, విభూది రాలుతున్నట్లుగా దర్శనమిచ్చాడని చెప్పినట్లు సమాచారం. తనకు ఉన్న భూమిలో కొంత భాగాన్ని శివాలయ నిర్మాణానికి కేటాయిస్తానని గ్రామ పెద్ద ముందుకు వచ్చినట్లు తెలిసింది. అనంతరం గ్రామస్తులంతా సమావేశమై, జలంతో సంబంధం ఉన్న ప్రదేశంలో శివలింగం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్వామివారికి శ్రీ మహా జలలింగేశ్వరుడు అని నామకరణం చేశారు. పండితుల సూచనల మేరకు ఒక తొట్టిలో నీటిని నింపి అందులో శివలింగాన్ని ఉంచారు. కార్తీక మాసం మొదటి సోమవారం సాయంత్రం ఏడు గంటలకు అభిషేకం నిర్వహించి, దీపారాధనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. భూగర్భం నుంచి శివలింగం వెలుగులోకి వచ్చిన ఘటనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భవిష్యత్తులో అక్కడ శివాలయ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో గ్రామస్తులు ముందుకు సాగుతున్నారు.