చాట్రాయి సొసైటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చాట్రాయి సొసైటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సకల భారతావని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా చాట్రాయి సహకార సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులను స్మరించుకున్నారు.
చాట్రాయి సొసైటీ అధ్యక్షులు తుమ్మల రామమోహనరావు జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి సందేశాన్ని అందించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు దివ్వెల జయరాజు, కాలసాని సత్యనారాయణ, మందపాటి బసవా రెడ్డి, చాట్రాయి వ్యవసాయ అధికారి బి. శివశంకర్, తుమ్మల జగన్, తుమ్మల కరుణాకర్, ఓరుగంటి రామారావు, ఓరుగంటి చెన్నారావు, శీర్ణం వేణుగోపాల రెడ్డి, రైతులు, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.