BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 24 August 2026, 12:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా కె. మాధవి బాధ్యతల స్వీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:45 PM
151 వీక్షణలు

నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా కె. మాధవి బాధ్యతల స్వీకారం

నాగిరెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల నూతన ప్రిన్సిపాల్‌గా కె. మాధవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు బాలికల గురుకుల పాఠశాలలో పీజీటీ సోషల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కె. మాధవి డిప్యుటేషన్‌పై బదిలీ అయి నాగిరెడ్డిగూడెం పాఠశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.

ఇంతవరకు పాఠశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించిన ఎస్. హేమలత ప్రస్తుతం తెలుగు పండిట్‌గా కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ కె. మాధవి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని, పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

విద్యార్థులలో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆమె తెలిపారు. నూతన ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాఠశాల సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.