BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 12:45 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – పేదల సొంతింటి కల సాకారం

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
24 Aug, 2026 - 12:45 PM
246 వీక్షణలు

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం – పేదల సొంతింటి కల సాకారం

మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన 4 ఇందిరమ్మ ఇళ్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సురేఖమ్మ లబ్ధిదారుల కుటుంబాలతో ఆప్యాయంగా మాట్లాడి, నూతన గృహాలను పరిశీలించి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కొత్త ఇంటి గడప దాటిన వేళ లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సొంతింటి కల నెరవేరడంతో వారి కళ్లలో ఆనందం, హృదయాల్లో సంతోషం కనిపించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు సురేఖమ్మ గారిని శాలువాలతో ఘనంగా సన్మానించి, తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. తమ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, సొంతింటి కలను సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, శ్రీమతి కొక్కిరాల సురేఖకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం కల.. ఆ కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యం” అని ఈ సందర్భంగా సురేఖమ్మ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేటర్లు ఎంబడి కుమారస్వామి, తాళ్ల సంపత్ రెడ్డి, ఖలీద్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్ తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.