BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 08:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు బీమాపై సందిగ్ధం.. రైతు కుటుంబాల్లో ఆందోళన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:31 AM
75 వీక్షణలు

రైతు బీమాపై సందిగ్ధం.. రైతు కుటుంబాల్లో ఆందోళన

రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న రైతు బీమా పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. బీమా గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు, రైతు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వారం రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాల్లో 12 మంది రైతులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీకి ముందుగానే వ్యవసాయ భూముల పట్టాలు కలిగిన రైతుల పేర్లపై ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించకపోవడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదు. కొత్త పథకం నేపథ్యంలో రైతు బీమా కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

రైతు కుటుంబాలకు భరోసాగా రైతు బీమా

రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో 2019 ఆగస్టు 15న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. రైతు సహజ మరణం పొందినా, ప్రమాదవశాత్తు మృతి చెందినా కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు.

భారత బీమా సంస్థతో ఒప్పందం ద్వారా అమలు చేసిన ఈ పథకం వల్ల రైతు మరణం తర్వాత కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయం అందేది. పంట నష్టాలు, అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు కొంత ఊరట లభించేది.

గత ఏడాది జిల్లాలో 96,850 మంది రైతులకు రైతు బీమా కల్పించారు. ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున ప్రభుత్వం రూ.32 కోట్ల 92 లక్షల 90 వేల ప్రీమియం చెల్లించింది. బీమా కాలంలో జిల్లాలో 421 మంది రైతులు మృతి చెందగా, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.21 కోట్ల 5 లక్షల పరిహారం అందింది.

ఈ గణాంకాలు రైతు కుటుంబాలకు రైతు బీమా ఎంతటి భరోసాను అందిస్తుందో స్పష్టం చేస్తున్నాయి.

12 కుటుంబాల పరిస్థితి ఏమిటి?

బీమా గడువు ముగిసిన వెంటనే రైతుల మరణాలు చోటు చేసుకోవడంతో ఆయా కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. రైతు బీమా కొనసాగుతోందా? కొత్త పాలసీ ప్రక్రియ పూర్తయిందా? అన్న విషయాలపై స్పష్టత లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రూ.5 లక్షల పరిహారం అందుతుందన్న నమ్మకంతో ఉన్న కుటుంబాలకు ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. గత ఏడాది రైతు బీమా గడువు ఈ నెల 14తో ముగిసింది. సాధారణంగా కొత్త బీమా కాలానికి ముందే ప్రీమియం చెల్లింపులు, రైతుల వివరాల నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.

అయితే ఈసారి గడువు ముగిసే వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతుల్లో సందేహాలు పెరుగుతున్నాయి. అసలు రైతు బీమా పథకం కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పథకం అమలుపై స్పష్టత ఇవ్వాలి

రైతు బీమా పథకం అమలుపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రీమియం చెల్లింపు పరిస్థితి, కొత్త బీమా కాలం, అర్హులైన రైతుల సంఖ్య, గడువు ముగిసిన తర్వాత జరిగిన మరణాలకు వర్తించే నిబంధనలు, పెండింగ్‌ క్లెయిమ్‌లపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా ఇప్పటికే జిల్లాలో మృతి చెందిన 12 మంది రైతుల కుటుంబాలకు బీమా పరిహారం అందుతుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం తక్షణమే తేల్చాలని కోరుతున్నారు. రైతు బీమా పథకం అమలుపై స్పష్టత ఇవ్వాలని జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.