BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 12:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కణేకల్లు క్రాసింగ్‌కు మంత్రి నారా లోకేశ్ పర్యటన.....

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:41 PM
74 వీక్షణలు

కణేకల్లు క్రాసింగ్‌కు మంత్రి నారా లోకేశ్ పర్యటన.. సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

25న అనంతపురం జిల్లా పర్యటనకు విద్యాశాఖ మంత్రి.. భారీగా స్వాగత ఏర్పాట్లు

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 25వ తేదీన అనంతపురం జిల్లా కణేకల్లు క్రాసింగ్‌కు మంత్రి నారా లోకేశ్ రానున్నారు. సుజ్లాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 300 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు విస్తరణకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

పర్యటనలో భాగంగా 25వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి మంత్రి బయలుదేరుతారు. 7.10 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని, 7.20 గంటలకు విమానంలో బయలుదేరి 8.20 గంటలకు బళ్లారి సమీపంలోని జిందాల్ విజయనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం రోడ్డు మార్గంలో 9.40 గంటలకు బళ్లారి సమీపంలోని హాలకుంది చేరుకుని సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డును సందర్శిస్తారు. అక్కడ ప్రాజెక్టు పనులు, కంపెనీ కార్యకలాపాలను పరిశీలించనున్నారు.

తర్వాత 10.40 గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకోనున్న మంత్రి నారా లోకేశ్‌కు శాంతినగర్‌లోని చంద్రబాబు నాయుడు పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు కణేకల్లు క్రాసింగ్‌కు చేరుకుని సుజ్లాన్ పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది.

సభ అనంతరం 2.15 గంటలకు నల్లంపల్లి వద్ద పార్టీ కార్యకర్తలతో మంత్రి సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు.