BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 24 August 2026, 12:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో బంగారం ధరలకు భారీ పెరుగుదల.....

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 12:39 PM
55 వీక్షణలు

హైదరాబాద్‌లో బంగారం ధరలకు భారీ పెరుగుదల.. రూ.1.63 లక్షలకు చేరిన పసిడి 

హైదరాబాద్, ఆగస్టు 24: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పసిడి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. 

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 పెరిగి రూ.1,50,300 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. కిలో వెండి ధర రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం కొనుగోలు చేసే కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. మరోవైపు పెట్టుబడి సాధనంగా బంగారంపై ఆసక్తి పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.