BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 20 August 2026, 09:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయికి గర్వకారణం.. ఉత్తమ ఎస్సైగా రామకృష్ణకు ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 09:38 PM
190 వీక్షణలు

చాట్రాయికి గర్వకారణం.. ఉత్తమ ఎస్సైగా రామకృష్ణకు ఘన సత్కారం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణకు జిల్లా ఉత్తమ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రశంసా పత్రం లభించడం చాట్రాయి మండల ప్రజలకు గర్వకారణమని టీడీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు.

ఆగస్టు 15న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఎస్సై రామకృష్ణ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత, ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కిందని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా చాట్రాయి బూరుగుగూడెం జనసేన, టీడీపీ నాయకులు ఎస్సై రామకృష్ణను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరింత సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓరిగంటి రామారావు, ఓరిగంటి శ్రీను, జనసేన మండల ఉపాధ్యక్షుడు తుమ్మల జగన్, తుమ్మల కరుణాకర్, అంబటి చంద్రశేఖర్, రమేష్, చెన్నారావు, వెల్లంకి శ్రీమన్నారాయణ, శోభన్ బాబు, శ్రీనివాస్, వేణు, శ్రీను, చిలుకుబత్తుల శివ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభినందనలు తెలిపారు.