BREAKING
thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం
Date of Publish : 19 August 2026, 04:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 04:10 PM
105 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.చాట్రాయి మండల ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా సమావేశమై ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పుష్పగుచ్ఛం సమర్పించి, పూలతో అభిషేకం చేశారు.తదుపరి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, సీనియర్ ఫోటోగ్రాఫర్లను షీల్డులు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. యూనియన్ సభ్యులందరికీ జ్ఞాపికలను అందజేసి, అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు సవరం రామారావు అధ్యక్షత వహించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లు సోమిశెట్టి శ్రీనివాసరావు, పడగ షణ్ముఖ, ఉపాధ్యక్షుడు గమిడిమెల్లి ప్రభాకర్, కోశాధికారి లింగోజు మురళి, కార్యదర్శి రెబ్బు సుమన్, సంయుక్త కార్యదర్శి ఇజ్జిగిరి కేశవ తదితరులు పాల్గొన్నారు.ఫోటోగ్రఫీ రంగానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చాట్రాయిలో ఘనంగా నిర్వహించడం పట్ల ఫోటోగ్రాఫర్లు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సవరం రామారావు, సంయుక్త కార్యదర్శి ఇజ్జిగిరి కేశవ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, జీవితంలోని మధుర జ్ఞాపకాలను భద్రపరిచే గొప్ప కళ అని అన్నారు. సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనను ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ రంగానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.