చౌదరిగూడలో విద్యార్థులకు భద్రతపై అవగాహన
సైబర్ నేరాలు, బాలల భద్రత, మాదకద్రవ్యాలపై షీ టీమ్స్ అవగాహన
ఘట్‌కేసర్ | Ntoday News
పోచారం చౌదరిగూడలోని ఎంపీపీఎస్ పాఠశాలలో మెడిపల్లి షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్స్ పనితీరు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, బాలల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.
అలాగే సీసీటీవీ నిఘా ప్రాధాన్యత, టీ-సేఫ్ సేవల గురించి కూడా అవగాహన కల్పించారు. వాస్తవ ఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థులు ఆన్‌లైన్ మోసాలు, అపరిచిత వ్యక్తుల పరిచయాలు, అనుమానాస్పద లింకులు, లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని షీ టీమ్స్ సిబ్బంది సూచించారు. బాలల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.