BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీమలపాడు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పరిశీలించిన తిరువూరు ఆర్డీఓ ఏ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:01 PM
23 వీక్షణలు

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

ఏ. కొండూరు, నవంబర్ 19: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం చీమలపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, తయారీ విధానం, పరిశుభ్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని, వంటకు ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలను, భోజనం తయారు చేస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులకు స్పష్టం చేశారు. వంట తయారీలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలుపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ స్వయంగా పర్యవేక్షణ చేయాలని, విద్యార్థులకు భోజనం అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీలో భాగంగా ఆర్డీఓ ఏ. కుమార్ స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం రుచిగా ఉంటుందా, నాణ్యత ఎలా ఉంది, ప్రతిరోజూ సక్రమంగా అందిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆర్డీఓ సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కేవలం భోజనం అందించే కార్యక్రమం మాత్రమే కాదని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏ. కొండూరు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.