BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చీమలపాడు సమస్యాత్మక గ్రామంపై ఆర్డీఓ ప్రత్యేక నిఘా.. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:01 PM
24 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, ఏ. కొండూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏ. కొండూరు మండలం చీమలపాడు గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ గురువారం పరిశీలించారు. చీమలపాడు గ్రామం సమస్యాత్మక గ్రామంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో పోలింగ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ సూచించారు. పోలింగ్ సమయంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఏ. కొండూరు ఎంపీడీవో, గంపలగూడెం తహసీల్దార్, ఏ. కొండూరు ఎస్సైలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలపై తగిన ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆర్డీఓ ఏ. కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.