BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 03:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో బాణసంచా ధరలకు రెక్కలు.. సామాన్యుల జేబులకు చిల్లులు!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 03:50 PM
32 వీక్షణలు

దీపావళి వేళ టపాసుల ధరల పెరుగుదలతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం ఏలూరు జిల్లా, చింతలపూడి: దీపాల పండుగ దీపావళి వేళ చింతలపూడిలో బాణసంచా ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టపాసుల ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆనందం కోసం సరదాగా టపాసులు కొనుగోలు చేయాలన్నా అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. చిన్న చిన్న కాకర్స్ ప్యాకెట్ల నుంచి పెద్ద బాణసంచా బాక్సుల వరకు ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆచితూచి కొనుగోళ్లు చేయాల్సి వస్తోంది. గతంలో తక్కువ మొత్తంతోనే పండుగకు అవసరమైన టపాసులు కొనుగోలు చేసేవారమని, ప్రస్తుతం అదే స్థాయిలో కొనాలంటే రెట్టింపు ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబ బడ్జెట్లు తలకిందులవుతున్న నేపథ్యంలో దీపావళి పండుగ ఖర్చులు మరింత భారంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ, పెరిగిన ధరల కారణంగా కొనుగోళ్లకు పరిమితులు విధించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. దీపావళి వెలుగులు ప్రతి ఇంటా విరజిమ్మాలని ఆశిస్తున్న ప్రజలకు బాణసంచా ధరల పెరుగుదల మాత్రం ఆర్థిక భారంగా మారింది. పండుగ ఆనందం ఉన్నా.. టపాసుల ధరలు చూస్తే మాత్రం జేబుకు చిల్లులే!