BREAKING
thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకలు thumb ● విద్యుత్ శాఖలో వేలాది ఖాళీలు.. భర్తీకి అనుమతులు ఎప్పుడు? thumb ● సంస్థాన్‌ నారాయణపురంలో ఇందిరాగాంధీకి ఘన నివాళులు thumb ● రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి thumb ● రేణిగుంటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:07 pm
Posted by : PAGADALA DEVAIAH

చైతన్య వికాస్ మహిళా సహకార సంఘం 20వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
31 Oct, 2026 - 07:07 PM
14 వీక్షణలు

వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే

మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకార సంఘాల సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్‌బీనగర్‌, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని చింతలకుంట సమీపంలో ఉన్న ఆర్‌టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో చైతన్య వికాస్‌ మహిళా సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్‌ 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్‌బీనగర్‌ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన, పొదుపు అలవాట్ల పెంపుదల, పరస్పర సహకారం వంటి లక్ష్యాలతో మహిళా సహకార సంఘాలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ కుటుంబాల అభ్యున్నతితో పాటు సమాజ అభివృద్ధిలోనూ భాగస్వాములు కావడం సంతోషకరమని పేర్కొన్నారు.

చైతన్య వికాస్‌ మహిళా సహకార సంఘం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి సంఘం ఇదే స్ఫూర్తితో నిరంతరం కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.