BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:24 pm
Posted by : PAGADALA DEVAIAH

పత్రికల పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి.. మ్యాగజైన్లకు నెలవారీ ప్రకటనలు ఇవ్వాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
31 Oct, 2026 - 07:24 PM
41 వీక్షణలు

ప్రత్యేక కార్పొరేషన్‌, జర్నలిస్టులకు ఆరోగ్య, ప్రమాద బీమా సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌

చిన్న, మధ్యతరహా పత్రికల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎడిటర్స్‌ జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): ప్రభుత్వ శాఖల నుంచి చిన్న, మధ్యతరహా పత్రికలకు రావాల్సిన పెండింగ్‌ ప్రకటనల బకాయిలను వెంటనే చెల్లించి వాటి మనుగడకు సహకరించాలని స్మాల్‌, మీడియం న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ మ్యాగజైన్స్‌ ఎడిటర్స్‌ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పత్రికల సమస్యలు, జర్నలిస్టుల సంక్షేమంపై పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా చిన్న, మధ్యతరహా దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు క్రమం తప్పకుండా ప్రచురితమవుతున్నాయని తెలిపారు. ఈ రంగంపై ఆధారపడి సుమారు ఐదు వేల మంది పాత్రికేయులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న పత్రికల మనుగడ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రకటనల జారీలో సమాన అవకాశాలు కల్పించాలి

చిన్న, మధ్యతరహా పత్రికల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. ప్రకటనల బిల్లుల సమర్పణకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసి, వాటి చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని సూచించారు.

ఒకే టైటిల్‌ పేరుతో ఎంప్యానెల్‌ అయిన దినపత్రిక, మ్యాగజైన్లలో ఏదో ఒకదానికి మాత్రమే ప్రకటనలు జారీ చేయాలని కోరారు. అదే సమయంలో దినపత్రికలకు ఇచ్చే విధంగానే మ్యాగజైన్లకు కూడా ప్రతి నెలా కనీసం ఒక ప్రకటన జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పత్రికల ఎంప్యానెల్‌మెంట్‌ ప్రక్రియను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటనల సందర్భంగా చిన్న, మధ్యతరహా పత్రికలు, మ్యాగజైన్లకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రకటనలు ఇవ్వాలని కోరారు.

జర్నలిస్టులకు ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాలి

పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేలా, విద్యా ఖర్చులపై 75 శాతం రాయితీ కల్పించేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మీడియా అకాడమీ పాలక మండలిలో స్మాల్‌, మీడియం న్యూస్‌ పేపర్స్‌ అండ్‌ మ్యాగజైన్స్‌ ఎడిటర్స్‌ జేఏసీకి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. చిన్న, మధ్యతరహా పత్రికలు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. సమస్యలపై సంబంధిత అధికారులతో తక్షణ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో నేటి వాస్తవాలు పత్రిక ఎడిటర్‌ మహ్మద్‌ నజీమ్‌, గిరిజన సంస్కృతి పత్రిక ఎడిటర్‌ ఆర్‌. ధర్మానాయక్‌, తెలంగాణ టైగర్‌ పత్రిక ఎడిటర్‌ సీహెచ్‌. అశోక్‌, గ్రీన్‌ వాయిస్‌ పత్రిక ఎడిటర్‌ బాణాల శ్రవణాచారి, జనమ్‌ కలమ్‌ ఎడిటర్‌ నల్ల యాదయ్య గౌడ్‌, యువ నేత పిలుపు పత్రిక ఎడిటర్‌ డి. శ్రీను, న్యూస్‌ పవర్‌ ఎడిటర్‌ జి. స్వామి, నగర నిజం ఎడిటర్‌ ఏ. పురుషోత్తం, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.