BREAKING
thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత thumb ● ప్రత్యేక విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు యువజన కాంగ్రెస్‌ సమరశంఖం thumb ● పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ మహేందర్‌ రెడ్డికి ఎస్పీ ఘన సన్మానం thumb ● జాతీయ ఏక్తా దివస్‌ వేడుకల్లో కొత్తపేట సర్పంచ్‌ సందడి thumb ● ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భూసాని సోమయ్య thumb ● గిరిజన చట్టాలు, గ్రామసభ అధికారాలపై ప్రజలకు అవగాహన thumb ● ఇందిరాగాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయం thumb ● ఘనంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ జన్మదిన వేడుకలు thumb ● బాలల హక్కులు, పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ప్రభుత్వ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందజేత
మంచి మాట
Date of Publish : 31 October 2026, 07:26 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
31 Oct, 2026 - 07:26 PM
26 వీక్షణలు
  • ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి
  • రైతుల సౌకర్యార్థం పీఏసీఎస్‌–ఐకేపీ కేంద్రం ఏర్పాటు

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, ఉరుమడ్ల, అక్టోబర్‌ 31 (ఎన్‌ టుడే న్యూస్‌): రైతుల సౌకర్యార్థం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్‌–ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, విజయ డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రైతులకు అందుబాటులో కొనుగోలు సదుపాయం

గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు తమ పంటను విక్రయించేందుకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ సుంకరి మల్లేష్‌ గౌడ్‌, చిట్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్ర వినోద్‌ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ సాగర్ల భానుశ్రీ, కాంగ్రెస్‌ పార్టీ చిట్యాల మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పల్లపు బుద్ధుడు, చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కోనేటి యాదగిరి, ఉప సర్పంచ్‌ ఉయ్యాల నరేష్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఉప సర్పంచ్‌ ఉయ్యాల లింగయ్య పాల్గొన్నారు.

అలాగే గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్‌, మేడబోయిన స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ, ఎలిమినేటి హరిప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పోలగోని నరసింహ, గుత్త రవీందర్‌రెడ్డి, అనంతుల శంకరయ్య, బోయ స్వామి, రైతులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.