BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 10:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిత్తపూరు సర్పంచ్ బరిలో జనసేన నేతలు.. ముగ్గురి పేర్లపై గ్రామంలో జోరుగా చర్చ!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 10:26 AM
107 వీక్షణలు

చాట్రాయి: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో రాజకీయ సందడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వంపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. ఈసారి కూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా చిత్తపూరు పంచాయతీ సర్పంచ్ స్థానం జనసేన పార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం స్థానిక రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో జనసేన పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వలసపల్లి రామకృష్ణ, జంగాల సురేష్, బత్తుల శివ పేర్లు ప్రస్తుతం గ్రామ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నాయకులు తమదైన స్థాయిలో ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నేపథ్యంలో ఎవరికి అభ్యర్థిత్వం దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన కార్యకర్తలు, స్థానిక నాయకుల మధ్య కూడా ఈ పేర్లపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు కూటమి పార్టీల మధ్య సమన్వయం, గ్రామంలో నాయకుల బలాబలాలు, ప్రజల అభిప్రాయాలు అభ్యర్థి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పించినా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి విజయం సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడికే అవకాశం కల్పిస్తారా, లేక రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చే వరకు చిత్తపూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.