BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 March 2026, 08:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏపూరులో బెల్ట్ షాపులకు చెక్

తెలంగాణ
04 Mar, 2026 - 08:09 AM
338 వీక్షణలు
ఏపూరులో బెల్ట్ షాపులకు చెక్ NTODAY NEWS: చిట్యాల యువత భవిష్యత్తు కోసం గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోని ఏపూరు గ్రామంలో మద్యం మరియు మత్తు పదార్థాల విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ గ్రామపంచాయతీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రామ యువతలో పెరుగుతున్న వ్యసనాలు, కుటుంబాల్లో తలెత్తుతున్న వివాదాలు మరియు శాంతిభద్రతల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ పాలెం మహేష్ తెలిపారు. గ్రామాభివృద్ధి, యువత సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. లిఖితపూర్వక హామీలతో మద్యం విక్రయాల నిలిపివేత గ్రామంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల యజమానులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి వెంటనే మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వాహకులందరూ గ్రామ పరిధిలో ఇకపై ఎలాంటి మద్యం లేదా మత్తు పదార్థాల విక్రయం చేయబోమని హామీ ఇచ్చారు. సర్పంచ్ సమక్షంలో లిఖితపూర్వకంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని అభిప్రాయపడ్డారు. యువతను సన్మార్గంలో నడిపించేందుకు గ్రామపంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ హెచ్చరించింది. గ్రామ ప్రజల సహకారంతో ఈ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని పంచాయతీ పాలకవర్గం స్పష్టం చేసింది. #Apur #Chityal #Nalgonda #BeltShopsBan #VillageResolution #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube