News Headlines
Chief Minister honours Chaganti at the Secretariat
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
సైబర్ క్రైమ్ విద్యార్థులకు అవగాహనా సదస్సు
ఆర్టీఐ రక్షక్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా కూనురు మధు
ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ లో మార్పులు :- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డుల సర్వేలో :-కలెక్టర్ బి.సత్య ప్రసాద్
రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేల్ -మర్రిగుడం గ్రామ ప్రజల దాహం తీర్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు:- చలమల్ల కృష్ణ రెడ్డి
అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచార ఇవ్వాలి: ఎస్ఐ జగన్
దుర్గాదేవి ఉత్సవాలు సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థాన్:- ఎస్ఐ జగన్ సూచించారు

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి

Chief Minister honours Chaganti at the Secretariat
Spread the love

Chief Minister honours Chaganti at the Secretariatవిద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి

ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

తన బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి మేరకు కృషి చేస్తానన్న చాగంటి

సచివాలయంలో చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి

అమరావతి:- భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని… వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top