BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి....

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 07:22 PM
90 వీక్షణలు

పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న వేడి.. ‘ఎల్ నినో’తో ప్రపంచానికి పెను ముప్పు

1877 రికార్డులు బద్దలయ్యే అవకాశం.. భారత్‌పై కరువు మేఘాలు

రుతుపవనాలపై తీవ్ర ప్రభావం.. రైతన్నకు అశనిపాతం

పసిఫిక్ మహాసముద్రం మంటలు కక్కుతోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేని స్థాయిలో పెరుగుతూ ప్రపంచ వాతావరణ సమతుల్యతను తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం మరింత బలపడితే రాబోయే రోజుల్లో వర్షపాతంలో భారీ మార్పులు చోటుచేసుకుని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే భారీగా పెరుగుతున్నాయి. గతంలో 1877లో నమోదైన అత్యధిక ఎల్ నినో తీవ్రత రికార్డులను మించే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల గాలి ప్రవాహాల్లో మార్పులు చోటుచేసుకుని ప్రపంచవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్‌పై కరువు ప్రభావం?

భారత వ్యవసాయ రంగం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో సాధారణంగా రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, భూగర్భ జలాల తగ్గుదల, తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

గత ఎల్ నినో సంవత్సరాలను పరిశీలిస్తే వర్షపాతంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 2002లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకాగా, 2009లో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. 2015-16 కాలంలోనూ ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గింది.

ఎంజేఓపైనే ఆశలు

ప్రస్తుత పరిస్థితుల్లో భారత వాతావరణానికి మాడెన్ జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) కీలకంగా మారింది. భూమధ్యరేఖ వెంబడి కదిలే మేఘాలు, గాలులు, వర్షపాత వ్యవస్థల సమూహమే ఎంజేఓ. ఇది అనుకూలంగా కదిలితే రుతుపవనాలను బలోపేతం చేసి వర్షాలకు సహకరించే అవకాశం ఉంటుంది.

ఎంజేఓ అనుకూల ప్రభావం చూపితే ఎల్ నినో తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఎంజేఓ సహకారం లేకపోతే ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చి వ్యవసాయ రంగానికి, నీటి వనరులకు పెద్ద సవాల్‌గా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పరిశీలిస్తోంది.

మరుగుతున్న మహాసముద్రం.. మారుతున్న వాతావరణం.. రాబోయే కాలం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెద్ద ఆందోళనగా మారింది.