BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:28 pm
Posted by : NTODAY NEWS

చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
26 Aug, 2026 - 07:28 PM
87 వీక్షణలు

అర్హులైన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: సైదాబాద్ ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి

సైదాబాద్| ఎన్ టుడే న్యూస్

తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సైదాబాద్ ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి తెలిపారు.

ప్రథమ దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు (తాటి/ఈత కల్లు కార్మికులు), చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే థలసీమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో దివ్యాంగులైన వారు కూడా అర్హత నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన సంబంధిత ఉత్తర్వుల ప్రకారం అర్హత నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అర్హులైన వారు ముందుగా మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని, అనంతరం సంబంధిత దరఖాస్తు పత్రాలను మండల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

ఆగస్టు 31 చివరి తేదీ

దరఖాస్తుల స్వీకరణకు 2026 ఆగస్టు 31 చివరి తేదీగా నిర్ణయించినట్లు ఎమ్మార్వో మణిపాల్ రెడ్డి తెలిపారు. అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.