BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:26 pm
Posted by : LAKKA RAJASEKHAR

పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం.....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
26 Aug, 2026 - 07:26 PM
59 వీక్షణలు

పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం

మేడికొండూరు: వర్షాభావ పరిస్థితులతో పంట కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకునేందుకు సొంత ఖర్చులతో నీటిని పొలాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన సాంబయ్య 3.5 ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటకు నీరు అందించేందుకు గ్రామంలోని ఊరచెరువు నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి, మోటారు సహాయంతో నీటిని పొలాలకు తరలిస్తున్నారు. ఒక్కో పైపునకు రూ.1,500 చొప్పున మొత్తం 253 పైపులను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఇదే గ్రామానికి చెందిన మరో రైతు గజానంద్ రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటకు నీటి తడులు అందించేందుకు సొంతంగా ఖర్చు చేస్తూ నీటిని పొలాలకు తరలిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇలా వేలాది రూపాయలు అదనంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట కాలువలకు సాగునీరు విడుదల చేసి తమ పంటలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.