BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 07:02 PM
69 వీక్షణలు

ఏలూరు: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష.. 414 కోట్లతో 388 పనులకు ప్రతిపాదనలు

ఏలూరు: గోదావరి మహా పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర సచివాలయం నుంచి జరిగిన ఈ సమీక్షలో మంత్రులు, పుష్కరాల ప్రత్యేక అధికారి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాటు, మౌలిక వసతులు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.

సమావేశంలో ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి జిల్లాలో గోదావరి మహా పుష్కరాల కోసం చేపట్టనున్న ఏర్పాట్ల వివరాలను సీఎంకు వివరించారు. ఏలూరు జిల్లాలో రూ.414 కోట్ల అంచనా వ్యయంతో 388 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, భక్తుల సౌకర్యార్థం 28 స్నాన ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు వివిధ శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్‌ వెల్లడించారు.