BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నందిగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 06:21 PM
68 వీక్షణలు

నందిగామలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ:

మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ పట్టణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మ మార్గాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తోటి ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ, కరుణతో సేవ చేయడం ద్వారానే ప్రవక్త ఆశయాలను ఆచరణలో పెట్టినట్లు అవుతుందని తెలిపారు.

ప్రవక్త దయ, కరుణ, బోధనలు ఈ పవిత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర పర్వదినం సమాజంలో శాంతి, సద్భావన, సోదరభావాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ విభాగం నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.