BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 06:59 pm
Posted by : NTODAY NEWS

మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
24 Aug, 2026 - 06:59 PM
108 వీక్షణలు

చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా నేతలు

సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటని సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. శ్రవణ్ కుమార్, ఎం. బాలు అన్నారు.

మల్లారెడ్డి నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంతాప సభలో నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, భూ సంస్కరణలపై మల్లారెడ్డికి ఎంతో లోతైన అవగాహన ఉండేదని అన్నారు. అటువంటి అనుభవం, విషయ పరిజ్ఞానం కలిగిన నాయకుడిని మళ్లీ చూడటం కష్టమని పేర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జన్మించిన మల్లారెడ్డి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ విస్తరణకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ రైతాంగ, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఆయన కృషి చేశారని గుర్తుచేశారు.

మల్లారెడ్డి వివిధ సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా సందర్శించి, వాటిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించేవారని నాయకులు తెలిపారు. ఆయన అందించిన సూచనలను అధికారులు సైతం పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనే డిమాండ్‌పై మల్లారెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారని నాయకులు గుర్తుచేశారు. అప్పట్లో ఆయన చేసిన కృషి, సూచనల ఫలితంగానే అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని తెలిపారు.

కుమురం భీం, వట్టివాగు, జగన్నాథ్‌పూర్ తదితర ప్రాజెక్టులను అనేక సందర్భాల్లో సందర్శించి, వాటి సమస్యలపై స్పందించిన మల్లారెడ్డి జల వనరులు, వ్యవసాయ రంగంపై అపారమైన అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు.

కుమురం భీం జిల్లాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించడం ద్వారా మల్లారెడ్డి ఆలోచనలకు నిజమైన గౌరవం లభిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయన మృతి సీపీఎంకే కాకుండా రైతాంగ ఉద్యమానికి, వ్యవసాయ రంగానికి కూడా తీరని లోటని అన్నారు.

మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు సీపీఎం హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మామిడి మీనా, లోకసని కోటయ్య, ఆడెపు కృష్ణ, నసీబుజహాన్, బిందు తదితరులు పాల్గొన్నారు.