BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 25 August 2026, 04:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రంప్‌ ప్రభుత్వం నుంచి భారీ షాక్‌..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:41 PM
69 వీక్షణలు

ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌.. హెచ్‌-1బీ వీసా ఫీజు రూ.86 లక్షలకు ప్రతిపాదన

భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం.. కొత్త నిబంధనపై 30 రోజులపాటు అభిప్రాయాల సేకరణ

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా జారీ చేసే హెచ్‌-1బీ వీసాలపై ఏకంగా 1,03,265 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.86 లక్షలు) ఫీజు విధించే ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

హెచ్‌-1బీ వీసాల కోసం ప్రతిపాదించిన ఈ భారీ ఫీజుపై 30 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్ని ప్రక్రియలు పూర్తయితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లక్ష డాలర్ల ఫీజును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ నిర్ణయాన్ని ఫెడరల్‌ కోర్టు నిలిపివేయడంతో ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.

భారతీయులకే ఎక్కువ దెబ్బ

అమెరికా కంపెనీలు సాంకేతిక రంగం, ఇంజినీరింగ్‌, విద్య, పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసాలను వినియోగిస్తున్నాయి. ప్రతి ఏడాది 65 వేల సాధారణ హెచ్‌-1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి అదనంగా 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన హెచ్‌-1బీ వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయ నిపుణులకే లభించాయి. చైనా నిపుణులు 12 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. దీంతో కొత్త ఫీజు అమల్లోకి వస్తే భారతీయ ఉద్యోగార్థులు, ఐటీ రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే హెచ్‌-1బీ వీసా కలిగిన వారి పునరుద్ధరణకు, అలాగే విద్యార్థి వీసా నుంచి హెచ్‌-1బీకి మారే విదేశీయులకు ఈ భారీ ఫీజు వర్తించదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.

దుర్వినియోగాన్ని అరికట్టేందుకే: ట్రంప్‌ ప్రభుత్వం

హెచ్‌-1బీ కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని పేర్కొంటోంది.

భారీ ఫీజు విధించడం ద్వారా అమెరికన్‌ ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ప్రయోజనకరంగా మారుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే వ్యాపార సంస్థలు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నాయి.

అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడంలో హెచ్‌-1బీ వీసా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని, అధిక ఫీజులు విధించడం వల్ల సాంకేతిక రంగానికి నష్టం కలిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.