BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 August 2026, 08:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 08:22 PM
75 వీక్షణలు

ఘనంగా కొండపర్వ గ్రామంలో బీ.పీ. మండల్ జయంతి వేడుకలు.. ఓబీసీల అభ్యున్నతికి ఆయన సేవలు చిరస్మరణీయం

విస్సన్నపేట, ఆగస్టు 25:

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ రిజర్వేషన్ల పితామహుడు, మండల్ కమిషన్ చైర్మన్, సంఘసంస్కర్త బీ.పీ. మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీ.పీ. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బోట్ల శివ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీ.పీ. మండల్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించి, బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అవకాశాలు పెరగడానికి మండల్ చేసిన కృషి చారిత్రాత్మకమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు యామిని, సాయిమణికంఠ, హరీష్, హర్ష తదితరులు పాల్గొని బీ.పీ. మండల్ సేవలను స్మరించుకున్నారు.