చైనా, అమెరికా శత్రువులుగా కాదు.. భాగస్వాములుగా ఉండాలి
చైనా, అమెరికా శత్రువులుగా కాదు.. భాగస్వాములుగా ఉండాలి: జిన్‌పింగ్
ఎన్ టుడే న్యూస్: అమెరికా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, అమెరికా దేశాలు శత్రువులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇరు దేశాలు గొప్ప దేశాలని, రెండు దేశాల ప్రజలు కూడా గొప్పవారని ఆయన పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
చైనా, అమెరికా పరస్పరం సహకరించుకుంటూ ఒకే దిశలో ముందుకు సాగాలని జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో స్థిరత్వం, సహకారం కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేలో చైనాలో పర్యటించిన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన సంబంధాన్ని నిర్మించుకోవడానికి తామిద్దరం అంగీకరించినట్లు జిన్‌పింగ్ తెలిపారు.
ప్రపంచ స్థాయిలో చైనా, అమెరికా మధ్య సంబంధాలు కీలకంగా ఉన్న నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సహకారం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.