BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 04 October 2026, 04:09 pm
Posted by : PAMMI NAVEENKUMAR

రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
Reporter
pammi naveenkumar రావులపాలెం మండల ప్రతినిధి
04 Oct, 2026 - 04:09 PM
14 వీక్షణలు



అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇందుపల్లి–బండార్లంక, ముక్కామల ప్రాంతాల్లో ఇటీవల నిర్మించిన రోడ్ల నాణ్యతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రోడ్లు కొద్దికాలానికే దెబ్బతినడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇందుపల్లి, ముక్కామల ప్రాంతాల్లోని రోడ్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈదరపల్లి బ్రిడ్జి నుంచి ముక్కామల వైపు ఉన్న రహదారితో పాటు ఎన్‌కౌంటర్ బ్రిడ్జి నుంచి ఇందుపల్లి గరువు వైపు నిర్మించిన రహదారులను పరిశీలించినట్లు తెలిపారు.

ఎన్‌కౌంటర్ బ్రిడ్జి నుంచి ఇందుపల్లి, గరువు వైపు వెళ్లే రహదారికి ఉపాధి హామీ నిధుల కింద సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందని, ముక్కామల వైపు ప్రధాన రహదారి పనులకు సుమారు రూ.11.50 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టినప్పటికీ రోడ్డు, రిటైనింగ్ వాల్ పరిస్థితిపై నాణ్యతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.

కొత్తగా నిర్మించిన రోడ్లు కొద్దికాలానికే పగుళ్లు రావడం, పెచ్చులు ఊడిపోవడం, రిటైనింగ్ వాల్ దెబ్బతినడం వంటి పరిస్థితులు ఉంటే నిర్మాణ నాణ్యతను సాంకేతికంగా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పనుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగాలతో పాటు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పనులపై ఎలా పర్యవేక్షణ చేశారో వెల్లడించాలని కోరారు.

రోడ్ల నిర్మాణ సమయంలో కాలువల్లో నీటిని నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో పనులు చేపట్టినప్పుడు నాణ్యతపై అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాల్సి ఉందన్నారు.

ఇందుపల్లి ప్రాంతంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన రహదారి ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా నిర్మించలేదనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఉపాధి హామీ నిధులను గ్రామాలు, పల్లెలు, నివాస ప్రాంతాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిబంధనలకు అనుగుణంగా వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణం కొందరి వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా జరిగిందనే ఆరోపణలపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రజాధనంతో చేపట్టిన పనులకు సంబంధించిన శాంక్షన్ వివరాలు, అంచనా వ్యయం, కాంట్రాక్టర్ వివరాలు, నాణ్యత పరీక్షల నివేదికలు, మెజర్‌మెంట్ బుక్ వివరాలు, బిల్లుల చెల్లింపుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పనుల నాణ్యతపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సాంకేతిక నిపుణులతో నాణ్యత పరీక్షలు నిర్వహించాలని కోరారు.

మూడు నెలల్లోనే రోడ్లు దెబ్బతినడానికి కారణాలు ఏమిటి, రిటైనింగ్ వాల్ పరిస్థితికి కారణం ఏమిటి, పనుల నాణ్యతను అధికారులు ఎలా పర్యవేక్షించారు, ఉపాధి హామీ నిధులను ఏ నిబంధనల ప్రకారం వినియోగించారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ రెండు రోడ్ల నిర్మాణాలపై సమగ్ర సాంకేతిక, విజిలెన్స్ విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన లేదా నాణ్యత లోపాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో, ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా ఉండాలని ఆయన అన్నారు.